- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని రంగంపేట పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు భరత్, మధు రూ.5000 కిటికీలకు జాలి, నిమిత్తం ప్రధానోపాధ్యాయులకు సోమవారం అందజేశారు. ఇరువురు ఆర్మీలో ఉద్యోగం పొంది , శిక్షణ పూర్తి చేసుకొని గ్రామానికి వచ్చి పాఠశాలకు ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



