Tuesday, December 30, 2025
E-PAPER
Homeక్రైమ్స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం చల్లగుండ్ల వారిపాలెం శివారులో తోటమూల లోని ఒక ప్రయివేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బస్సు మరో బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50కి పైగా విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తు, అక్కడే పంట పొలాల్లో పనిచేస్తున్న కూలీలు వెంటనే స్పందించి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -