- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ: పేదలకు అల్పాహారం అందించడం హర్షనీయమని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆల్ లైయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అందిస్తున్నా అల్పహార కార్యక్రమం మంగళవారం 1020 రోజుకు చేరింది.ఇంటర్ నేషనల్ లయన్స్ క్లబ్స్ అధ్యక్షులు లయన్ ఏపీ సింగ్ పుట్టినరోజు, తునికిపాటి యశోదమ్మ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఏడుకొండలు మనవళ్ళు నాగేంద్ర,రాము దాతృత్వంతో అల్పాహారం వితరణ చేపట్టారు. లైయన్స్ క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు అందిస్తుందని చెప్పారు. వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బియం.నాయుడు కార్యదర్శి కూటాల రాంబాబు, యనగండ్ల లింగయ్య, భాస్కర క్లబ్ సీనియర్ లయన్ లీడర్స్ ఏచూరి భాగ్యలక్ష్మి_మురహరి దంపతులు,తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామా వెంకటేశం,దివ్యంగా క్లబ్ అధ్యక్షులు దిద్దకుంట్ల శంకర్ రెడ్డి,కర్ర రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



