Tuesday, December 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేంద్రం తెచ్చిన కొత్త నాలుగు లేబర్ కోడ్లును రద్దు చేయాలి : జూలకంటి

కేంద్రం తెచ్చిన కొత్త నాలుగు లేబర్ కోడ్లును రద్దు చేయాలి : జూలకంటి

- Advertisement -
  • బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకరణ

నవతెలంగాణ-మిర్యాలగూడ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. నూతన కార్యవర్గానికి పూలమాల లు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల కాలరాసేందుకు కేంద్రం కుట్ర చేసిందన్నారు.

కార్మికుల సంక్షేమం ఈ చట్టాలతో తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. సంఘం పెట్టకుండా నిబంధనలు పెడుతున్నారని, 8 గంటల పని విధానాన్ని బదులు 12 గంటల పని విధానం తెచ్చారని దీనివలన కార్మికుల చేత వెట్టి చాకిరీ చేస్తున్నారన్నారు. కార్మికుల చట్టాలు నిర్వర్యం అయ్యాయని చెప్పారు. కార్మికులు ఐక్యంగా ఉండి హక్కుల సాధన, కొత్త చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు సీఐటీయూ లో ఉంటే వారికి పని, జీవిత భద్రత కలుగుతుందని చెప్పారు. ఆపదలో ఉన్న వారికి సంఘం అండగా నిలుస్తుందన్నారు. వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు చేస్తున్నదన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మికుల వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. నూతన కార్యవర్గం కార్మికులకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, జిల్లా నాయకులు బి ఎం నాయుడు, మంద రాజు, నూతన అధ్యక్షులు ఎస్ కే పాషా, ఉపాధ్యక్షులు ఎస్పీ నాయుడు, గోవర్ధన్ రెడ్డి, బుజ్జిబాబు, రాంబాబు, కోటేశ్వర రావు, ప్రసాద్, రెడ్యా నాయక్, శ్రవణ్, సైదులు, యాదగిరి, బాబు, గౌస్, నరేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -