Tuesday, December 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగురుకుల‌ వార్డెన్ భవానీ సస్పెండ్

గురుకుల‌ వార్డెన్ భవానీ సస్పెండ్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్‌పై వేటుపడింది. డిగ్రీ విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ భవానీని కలెక్టర్ సస్పెండ్ చేశారు. వార్డెన్‌పై పలు ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని DWOని ఆదేశించారు.

అసలేం జరిగిందంటే.. డిగ్రీ విద్యార్థినిని వార్డెన్ చితకబాదిన వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. ఎగ్జిట్‌ అయి చెప్పి పోయినవ్‌ కదా హాస్టల్‌లో.. ఎగ్జిట్‌ పన్నెండింటికి అయిపోతది. మళ్లీ ఎగ్జిట్‌ అయిపోయే టైం హాస్టల్‌ ఉండాలన్న సోయి లేదా నీకు అంటూ వార్డెన్‌ ఓ వైపు కర్రలు, మరోవైపు చేతులతో విద్యార్థినిని చితకబాదింది.
. ఈ రెండు ఘటనలను సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్.. వార్డెన్ భవానీని సస్పెండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -