- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కరీంనగర్ రూరల్ మండలం చర్లబూత్కుర్, కొండాపూర్ ఐత్రాచుపల్లి చమనపల్లి, బహద్దూర్ ఖాన్‌పేట గ్రామాల్లో పులి సందర్శించినట్లు అధికారులు గుర్తించారు. ఈ గ్రామాల పరిధిలోని మామిడి తోటలు, పంట పొలాల్లో పులి పాదాలను గుర్తించిన స్థానికులు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి పరిశీలించారు.
అవి పులి పాదాల గుర్తులేనని ధృవీకరించి స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. ఒంటరిగా బయటక వెళ్లకూడదన్నారు. ఈ గ్రామాలతో ఈ ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
- Advertisement -



