Thursday, May 22, 2025
Homeజాతీయంప్ర‌జ‌ల‌ను ఏమార్చడానికి..ఎంపీల దౌత్య బృందం: జైరాం ర‌మేష్

ప్ర‌జ‌ల‌ను ఏమార్చడానికి..ఎంపీల దౌత్య బృందం: జైరాం ర‌మేష్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆప‌రేష‌న్ సిందూర్, పాక్ పై దౌత్య యుద్ధానికి ఎంపీల‌తో కూడిన‌ గ్లోబెల్ టీంను కేంద్రం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. రేప‌ట్నుంచి ఆ బృందాలు ఆయా దేశాల్లో ప‌ర్య‌టించ‌నున్నాయి. తాజాగా కేంద్ర నిర్ణ‌యంపై మ‌రోసారి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ జైరాం ర‌మేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎంపీల దౌత్య బృందాల పేరుతో ప్ర‌జ‌ల‌ను ఏమార్చడానికి మోడీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు. ప‌హ‌ల్గాం దాడిపై, ఆప‌రేష‌న్ సిందూర్ పై చ‌ర్చిండానికి ప్ర‌త్యేక‌ పార్ల‌మెంట్ స‌మావేశాలు ఎందుకు ఏర్పాటు చేయ‌లేద‌ని ప్ర‌ధాని మోడీని ప్ర‌శ్నించారు. ఇది ముమ్మ‌టికి డైవ‌ర్టు రాజ‌కీయ‌మేన‌ని ఆయ‌న ఆరోపించారు. దేశంలోని అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు పార్ల‌మెంట్ స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని ఏప్రీల్ 22న నిర్వ‌హించిన ఆల్ పార్టీ మీటింగ్ లో ప్ర‌స్తావించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. అంతేకాకుండా ప‌లుమార్లు రాహుల్, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే లేఖలు కూడా రాశార‌ని ఆయ‌న తెలిపారు. అయిన కానీ మోడీ ప్ర‌భుత్వం పెడ‌చెవిన పెట్టింద‌ని జైరాం ర‌మేష్ మండిప‌డ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -