Thursday, May 22, 2025
Homeజాతీయంముర్షిదాబాద్ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు క‌మిటీ నివేదిక..ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డి

ముర్షిదాబాద్ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు క‌మిటీ నివేదిక..ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: 1995 నాటి వ‌క్ఫ్ బిల్లుకు స‌వ‌ర‌ణ‌లు చేస్తు కేంద్రం నూత‌న చ‌ట్టాన్ని ఆమోదించిన విష‌యం తెలిసిందే. ఉభ‌య స‌భ‌ల్లో సుదీర్ఘ చ‌ర్చ‌ల త‌ర్వాత కేంద్రం కొత్త వ‌క్ఫ్ బిల్లు చ‌ట్టాన్ని ఆమోదించి..రాష్ట్రప‌తి ఆమోద ముద్ర‌తో దేశ‌వ్యాప్తంగా ఆ చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చింది. ఈ చ‌ట్టంపై దేశ‌వ్యాప్తంగా మైనార్టీలు వ‌ర్గాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. ప్రాథ‌మిక హ‌క్క‌ల‌కు విరుద్ధంగా ఉన్న ఈ వ‌క్ఫ్ చ‌ట్టాన్ని వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఆల్ ఇండియా ముస్లీం ప‌ర్స‌న‌ల్ బోర్డు డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఈ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు పిలుపునిచ్చింది. కొత్త వ‌క్ఫ్ చ‌ట్టాన్ని వ్య‌తిరేస్తూ ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ లో చేపట్టిన నిర‌స‌న ర్యాలీ ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో పలు ఇండ్లు, ప్ర‌భుత్వ ఆస్తులు విధ్వంస‌మైయ్యాయి. అంతేకాకుండా ప‌లు ప్రాంతాల్లో అల్ల‌రిమూక‌లు ప్రేటేగి..హింస‌కు పాల్ప‌డ్డాయి. ప్ర‌జ‌ల ఇండ్ల‌లోకి చొర‌బ‌డి అందిన‌కాడికి దోచుకెళ్లారు. ఓ వ‌ర్గాన్ని టార్గట్ చేస్తూ దాడుల‌కు చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

బెంగాల్ లో శాంతిభ‌ద్ర‌తలు అదుపులోలేవ‌ని, రోజురోజుకు అల్ల‌ర్లు శృతిమించుతున్నాయ‌ని ప‌లువురు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించారు. స్పందించిన కోర్టు కేంద్ర బ‌ల‌గాల‌తో అల్ల‌ర్ల‌ను అదుపులోకి తేవాల‌ని మ‌మ‌త ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ముర్షిదాబాద్ ఘ‌ట‌న‌పై ఓ స్వ‌తంత్ర ద‌ర్యాప్తు క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. తాజాగా ఇవాళ ఆ క‌మిటీ నివేదిక‌ను అంద‌జేసింది. ఆ ద‌ర్యాప్తు స‌మ‌ర్పించిన రిపోర్టులో ప‌లు కీల‌క విష‌యాల‌ను బెంగాల్ హైకోర్టు బ‌హిర్గతం చేసింది. బెట్బోనా అనే గ్రామంలో113 ఇండ్లను అల్ల‌రిమూక‌లు ధ్వంసం చేశాయ‌ని, ఆ స‌మ‌యంలో లోక‌ల్ పోలీసులు ప్రేక్ష‌క పాత్ర షోషించార‌ని క‌మిటీ పేర్కొంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని వెల్ల‌డించింది. కేంద్ర బ‌ల‌గాలు, BSF క్యాంప్‌ల ద్వారా బాధితుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాయ‌ని ద‌ర్యాప్తు క‌మిటీ తెలిపింది. అల్ల‌రిమూక‌ల చేతిలో ప‌లువురు దారుణంగా హ‌త్య చేయ‌బ‌డ్డ‌రని, హింస‌చేల‌రేగిన ప్రాంతాల్లో పూర్తి ప‌లు షాపులు మూసివేయ‌డాన్ని, ప‌లు ప్రాంతాల్లో దుకాణాలు దోపిడీకి గురైయ్యాని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -