వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా కె.విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’. ఈ సినిమా విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు.
కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్, రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.
‘మాకు ఎప్పుడూ మూడ్ బాగా లేకపోయినా సినిమాని చూస్తాం.. ఇది మాకు స్ట్రెస్ బస్టర్ సార్ అని అంతా అంటుం టారు. ఆ క్రెడిట్ అంతా వెంకటేష్‌కే. కథ చెప్పిన వెంటనే మీతో ఆయన మనం చేసేస్తున్నాం అని అన్నారు. క్యారెక్టర్ బేస్డ్ సినిమా అని, రెండు మూడుసార్లు డైలాగ్ వర్షెన్ చెప్పించు కున్నారు. సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు. ఆయన కాబట్టి ముందుకు వచ్చి అలా చేసినట్టుగా అనిపిస్తుంది. ఆయనకి కథపై మంచి జడ్జ్‌మెంట్ ఉంటుంది.. విజయ భాస్కర్‌కి చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. అది ఈ సినిమా చాలా స్పష్టంగా కనిపిస్తుంది’ అని తెలిపారు.
ఈ క్రెడిట్.. వెంకీదే
- Advertisement -
- Advertisement -



