– తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
– ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్
నవతెలంగాణ -పెద్దవంగర: నూతన సంవత్సర వేడుకలకు డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకలను యువత ప్రశాంత వాతావరణంలో తల్లిదండ్రులతో కలిసి జరుపుకోవాలని సూచించారు. ఈ వేడుకలకు డీజే సౌండ్స్ అనుమతి లేదన్నారు. మండల వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విస్తృతంగా చేపడుతామని పేర్కొన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని స్పష్టం చేశారు. చైనా మాంజ నిషేదించినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్స్ వినియోగించి రోడ్లపై అల్లరి చేస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కేసుల నమోదు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. గంజాయి అక్రమ రవాణా తో పాటు మత్తు పదార్థాల వినియోగం, సరఫరా పై నిఘా పటిష్టం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
డీజేలకు అనుమతి లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



