Wednesday, December 31, 2025
E-PAPER
Homeజాతీయంనేడే ఆఖరి గడువు.. ఈ పనులు చేయకుంటే భారీ జరిమానా!

నేడే ఆఖరి గడువు.. ఈ పనులు చేయకుంటే భారీ జరిమానా!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : 2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025-26) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. సాధారణ గడువు లోపు ఐటీఆర్ ఫైల్ చేయని వారు జరిమానాతో ‘బిలేటెడ్ ఐటీఆర్’ దాఖలు చేయడానికి నేడే (డిసెంబర్ 31) ఆఖరి రోజు. అలాగే, ఇప్పటికే ఐటీఆర్ దాఖలు చేసి, అందులో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని సవరించుకోవడానికి కూడా ఆదాయపు పన్ను శాఖ నేటి వరకు మాత్రమే సమయం ఇచ్చింది.

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 234F ప్రకారం గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసేవారికి జరిమానా విధిస్తారు. లబ్ధిదారుడి మొత్తం ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే రూ. 1,000 జరిమానా చెల్లించాలి. ఒకవేళ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే రూ. 5,000 ఆలస్య రుసుము కట్టాల్సి ఉంటుంది. అయితే, ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఎటువంటి జరిమానా లేకుండా రిటర్నులు దాఖలు చేయవచ్చు.

గడువు దాటితే మీకు రావలసిన పన్ను రిఫండ్ నిలిచిపోతుంది. వ్యాపార లేదా పెట్టుబడి నష్టాలను తదుపరి సంవత్సరాలకు బదిలీ చేసుకునే అవకాశం ఉండదు. చెల్లించాల్సిన పన్నుపై నెలకు ఒకశాతం చొప్పున అదనపు వడ్డీ పడుతుంది. ఆదాయం ఉండి కూడా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.

చాలా మంది పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ నుంచి ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా ‘నడ్జ్’ మెసేజ్‌లు వచ్చాయి. మీ ఐటీఆర్‌లో ఉన్న సమాచారం, ఐటీ శాఖ వద్ద ఉన్న డేటాతో సరిపోలడం లేదని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారు నేటి రాత్రి 12 గంటల లోపు ‘రివైజ్డ్ ఐటీఆర్’ దాఖలు చేసి ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. లేనిపక్షంలో మీ రిఫండ్ నిలిచిపోవడమే కాకుండా, విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -