నవతెలంగాణ-హైదరాబాద్: కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో దేశంలో భద్రతా దళాలు అప్రమత్తమైయ్యాయి. ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈక్రమంలో జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు పెంచారు. పలు చోట్లు ఆయా సరిహద్దుల వద్ద ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి స్థానిక పోలీసులు, ఆర్మీ దళాలు కలిసి వాహనాల తనిఖీలు చేపట్టాయి. ఎముకలు కొరికే ప్రాంతం దోడాలోని భలేసా అనే ఎత్తైన ప్రదేశాల్లో సైతం భద్రతను బలగాలు కట్టుదిట్టం చేశాయి. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల చొరబాటును నిలువరించేందుకు డేఘ కన్నులతో పహరా కాస్తున్నారు. దోడాలోని గడ్డకట్టిన అడవులు, దాచిన పర్వత గుహలలో నావిగేట్ చేస్తున్నాయి దళాలు.
న్యూ ఇయర్ వేడుకలు..సరిహద్దు ప్రాంతాల్లో హైలర్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



