నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో అన్నదాతలకు కూలీల కొరత తీరనుంది. ప్రభుత్వం జనవరిలో యాంత్రీకరణ పథకం ప్రవేశపెట్టేందుకు ప్లాన్చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతుల నుంచి కావాల్సిన పరికరాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించింది. వాటిని పరిశీలన చేసిన అర్హులైన 1.31 లక్షల మంది రైతులకు వివిధ రకాలు పనిముట్లు ఇవ్వనుంది. ఎస్టీ, ఎస్టీ మహిళా రైతులకు 50 శాతం, ఇతర వర్గాలకు 40 శాతం రాయితీపై పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో రూ. 101.83 కోట్లతో ఈ పథకం అమలు చేయనుంది. వీటికి సంబంధించిన ఖర్చులను కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించనున్నాయి. గతంలో పరికరాలను కొనుగోలు చేసి రాయితీపై పంపిణీ జరిగేంది. ఈసారి మార్పులు చేసి కొత్త విధానాలు తీసుకొస్తోంది. పరికరాలు తయారు చేసే 16 కంపెనీలను గుర్తించి ఎం ప్యానెల్చేర్చింది. వాటి నుంచి రైతులు కొనుగోలు చేయాలి. రాయితీ కంపెనీలకు ప్రభుత్వం అందజేస్తుంది. పంపిణీ చేసిన పరికరాలు వ్యవసాయ శాఖ అధికారులు ఐదేళ్ల పాటు పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయనుంది. లక్ష కంటే విలువైన యంత్రాలకు జియో ట్యాంగ్వేస్తారు. ఇతర పరికరాలకు ఏఐ ఆధారిత టెలిమాటిక్స్కిట్ఏర్పాటు చేస్తారు. దీంతో యంత్రం అసలు ఉందా, ఎంత పనిచేసిందో గుర్తించవచ్చు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాల కోసం 5.50 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దశల వారీగా అవసరమైన వారికి పరికరాల పంపిణీ జరుగుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. ప్రభుత్వం నూతన సంవత్సరం కానుకగా అందజేస్తే ఈ రబీ సీజన్‌లో ఇతర రాష్ట్రాల నుంచి కూలీల కష్టపడి తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు. తక్కువ కూలీలు అవసరం ఉండటంతో స్థానికంగా కూలీలతో పనులు పూర్తి చేయవచ్చు. 8 సంవత్సరాల క్రితం కేసీఆర్ప్రభుత్వం యాంత్రీకరణ పథకం రద్దు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ప్రభుత్వం వచ్చిన తరువాత యాంత్రీకరణ పథకం పునరుద్దరణ నిర్ణయం తీసుకుంది. యువత ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా వ్యవసాయం వైపు అడుగులు వేసేలా చేస్తుంది. మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని రైతులకు అవగాహన చేసిన పరికరాలు తీసుకోవాలని ప్రచారం చేపట్టారు. దీంతో రెండు ఎకరాలపై ఉన్న అన్నదాతలంతా యంత్ర పరికరాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు తమకు యంత్రాలు ఇప్పించాలని స్ధానిక ఎమ్మెల్యేలను కోరుతున్నారు.



