Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవాలి 

ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవాలి 

- Advertisement -

– యాదగిరి పల్లి గ్రామంలో నిరసన 
నవతెలంగాణ – మిర్యాలగూడ : ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వర్యం చేస్తుందని ఆ పథకాన్ని రక్షించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని యాదిగిరి పల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వీబీజీ రాంజీ అనే పేరుతో చట్టం చేయడం సరైందికదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ పని దినాలను పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే కొత్త లేబర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విత్తన దిగుమతి చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. విద్యుత్ సంస్కరణ బిల్లును వెనక్కి తీసుకోవాలన్నారు. రైతులకు మద్దతు ధర అందే విధంగా కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని కోరారు. కార్మిక, రైతాంగ, వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మూడవత్ రవి నాయక్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పిల్లిట్ల సైదులు, రైతు సంఘం నాయకులు గోవింద్ రెడ్డి, రైతు సంఘం మండల నాయకులు సూర్యం, రామకృష్ణ, సీతారాములు, బిక్కు సాహెబ్, పిచ్చమ్మ, మైసమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -