Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 ప్రజల ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలగాలని కిషోర్ కుమార్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని. “కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ.. ఆశావహ దృక్పథంతో జీవితాలను చక్కదిద్దుకోవాలని అన్నారు. కోతల, ఎగవేతల, అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వానికి,ఈ సంవత్సరమైనా భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ అందిస్తారని ఆశిస్తూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -