- Advertisement -
నవతెలంగాణ-రామగిరి
శాంతియుతంగా 31 వేడుకలు జరుపుకోవాలని, తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రామగిరి ఎస్సై తాడవేన శ్రీనివాస్ అన్నారు. రామగిరి మండల పరిధిలోని కల్వచర్ల నుండి రామయ్య పల్లి వరకు ప్రజలు ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని సూచించారు. మండల పరిధిలో స్థానిక పోలీసులు, షీ టీమ్స్, మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి ప్రమాదాల నివారణ, అక్రమ సిట్టింగులు, బహిరంగంగా మద్యం సేవించడం, గుంపులుగా తిరుగుతూ, మహిళలను వేధించడం వంటి సంఘటనలను అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణతో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
- Advertisement -



