Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ లో వార్డుల విభజన సరి చేయాలి

మున్సిపల్ లో వార్డుల విభజన సరి చేయాలి

- Advertisement -

– బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మున్సిపల్ లో ఓటర్ల సంఖ్య పెరుగుదలకు అనుకూలంగా వార్డుల సంఖ్య పెంచాలని బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ కు నియోజకవర్గ అధికార ప్రతినిధి మల్లికార్జున్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓట్లర్ల లిస్ట్ లో తప్పులను సరి చేసే విధంగా కొత్త ఓటర్లను నమోదు చేయాలన్నారు. వార్డుల విభజన సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఓకే కాలనీ లో రెండు మూడు వార్డు లు ఉండడం వలన వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన ప్రజా ప్రజాప్రతినిధులు వార్డు లు అభివృద్ధి చేయడానికి కష్టాలు పడుతున్నట్టు కనబడుతుందన్నారు. ఒక కాలనీ లో ఓకే వార్డు పరిిధిలో ఉండే విధంగా చూడాలని కోరారు. అదేవిధంగా ఓటర్ల జాభితాలో తప్పుల తడకగా లేకుండా చూసి ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బొజ్జ హరీష్, పార్టీ సీనియర్ నాయకులు మల్కి రెడ్డి మోహన్ రెడ్డి, యాస శ్రీనివాస్, పట్టణ బి ఆర్ యస్ పార్టీ యూత్ విభాగం అధ్యక్షులు మేకల వికాస్ యాదవ్ పాలుగోన్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -