Wednesday, December 31, 2025
E-PAPER
Homeజాతీయంరాజస్థాన్‌లో ఉగ్ర కుట్ర భ‌గ్నం

రాజస్థాన్‌లో ఉగ్ర కుట్ర భ‌గ్నం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: న్యూ ఇయ‌ర్ వేడుక‌ల నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా భ‌ద్ర‌తాను క‌ట్టుదిట్టం చేసిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో పోలీసుల అప్ర‌మ‌త్తంతో రాజస్థాన్‌లో ఉగ్ర కుట్ర‌ను భ‌గ్నం చేశారు.టోంక్ జిల్లాలో 150 కిలోల అక్రమ అమ్మోనియం నైట్రేట్‌తో కూడిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూరియా ఎరువుల సంచులలో దాచి ఉంచిన ఈ పేలుడు పదార్థాలతో పాటు, దాదాపు 200 పేలుడు కాట్రిడ్జ్‌లు, ఆరు కట్టల సేఫ్టీ ఫ్యూజ్ వైర్ (సుమారు 1,100 మీటర్లు)ను కూడా గుర్తించారు. ఈ ఘటనలో సురేంద్ర మోచి, సురేంద్ర పట్వా అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి సేకరించారు, వాటిని ఎందుకు ఉపయోగించాలనుకున్నారు అనే విషయాలపై పోలీసులు వారిని విచారిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -