నవతెలంగాణ-హైదరాబాద్: మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభంకాబోతున్నాయి. నూతన ఏడాదిని కొత్తగా ఆహ్వానించాలని పలువురు జనాలు వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. పాత ఏడాదికి వీడ్కోలు చెప్పి, న్యూ ఇయర్‌కు వెల్ కమ్ చెప్పాలని ఉర్రూతలుగుతున్నారు. అందుకు చుక్క, మందుతో అంతా సిద్దం చేశారు. అయితే పోలీస్ యంత్రాంగం కీలక హెచ్చరికలు జారీ చేసింది. హద్దు మీరితే అంతే అంటూ వార్నింగ్ ఇచ్చింది. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే జైలుకు పంపిస్తామంటూ పేర్కొంది. హద్దులో ఉండి..పద్ధతిగా నూతన సంవత్సర వేడుకలు చేయాలని ప్రజలకు సూచిందింది.
కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ తోపాటు నగర శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెంచారు పోలీసులు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రమాదాలు నివారించడానికి డ్రంకన్ అండ్ డ్రైవ్ టెస్టులను ముమ్మరం చేశారు. ప్రధాన కూడల్లో వాహనాదారులకు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేక డ్రంకన్ అండ్ డ్రైవ్ టెస్టుల నేపథ్యంలో సిటీలో రెండు ఫ్లై ఓవర్లు మినహా అన్నింటిని మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. పీవీ ఎక్స్ ప్రెస్, బేగం పేట, టోలీ చౌకీ మార్గాల్లో ఉన్న వంతెనలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ సజ్జనార్ వెల్లడించారు.



