Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లాలో సరిపడా ఎరువులు...

జిల్లాలో సరిపడా ఎరువులు…

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రైతులకు సరిపడా యూరియా ఉందని రైతులు అవసరానికి మించి ఎరువులు తీసుకోరాదు సిఫార్సు మేరకు ఎరువులు తీసుకోవాలని రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ బి. నరసింహ రావు రైతులకు తెలిపారు.బుధవారం సూర్యాపేట మండలం లో నీ మన గ్రోమోర్ సెంటర్ వివిధ ఎరువుల డీలర్ షాప్స్ నీ తనిఖీ చేశారు.యాసంగి 2025 సీజన్ కు ప్రస్తుతం జిల్లాలో 9826 మె.ట. యూరియా రైతులకు సరఫరా చేయుటకు వివిద సొసైటీలు, డీలర్లు, ఎన్ డి సి ఎం ఎస్, ఏ ఆర్ ఎస్ కె  మార్క్ఫెడ్ గోధాంలలో అందుబాటులో ఉంది అని అన్నారు. బుధవారం వరకు 34731మె.ట యూరియా రైతులకు పంపిణీ చేయటం జరిగింది అని తెలిపారు.  యాసంగి 2025 సీజన్ కు గాను సూర్యాపేట జిల్లాలోని రైతులకు సకాలంలో ఎరువులు, సరఫరా చేసి ఎరువులు అందుబాటులో ఉంచేవిధంగా ప్రభుత్వం అన్ని కేంద్రాల్లో యూరియా నిల్వలను ఉంచుతున్నారు.

జిల్లాలో ఈ యాసంగి సీజన్ కు సరిపడిన అన్నీ ఎరువులు అందుబాటులో ఉన్నట్లుగా నిర్ధారించనైనది.రైతులకు సకాలంలో యూరియా అందజేసేందుకు అన్నీ రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది అని తెలిపారు.544 సెంటర్ ల ద్వారా యూరియా పంపిణీ  ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి గారు మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్ ,ఏవో టెక్నికల్ సునీత,ఎరువుల డీలర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -