Thursday, January 1, 2026
E-PAPER
Homeజాతీయంబ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ అలర్ట్.. నేటి నుంచే కొత్త రూల్స్

బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ అలర్ట్.. నేటి నుంచే కొత్త రూల్స్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక హెచ్చరిక జారీ చేసింది. జనవరి 1 నుంచే అమలులోకి వస్తున్న ఈ కొత్త సంస్కరణల ప్రకారం.. నిబంధనలు పాటించని, నిరుపయోగంగా ఉన్న లక్షలాది బ్యాంకు ఖాతాలు మూతపడే అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి, ముఖ్యంగా పెరుగుతున్న డిజిటల్ ఫ్రాడ్స్ (మోసాలను) అరికట్టడానికి ఆర్‌బీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
డోర్మెంట్ అకౌంట్లు 
వరుసగా రెండేళ్ల పాటు ఎటువంటి డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్ జరగని ఖాతాలను ‘డోర్మెంట్’గా పరిగణిస్తారు. ఇలాంటి ఖాతాలను నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నందున, వీటిని బ్యాంకులు శాశ్వతంగా క్లోజ్ చేయవచ్చు.
ఇన్-యాక్టివ్ అకౌంట్లు
గడిచిన 12 నెలలుగా ఎటువంటి లావాదేవీలు నిర్వహించని ఖాతాలను ‘ఇన్-యాక్టివ్’ కేటగిరీలోకి చేరుస్తారు. వీటిని తిరిగి యాక్టివేట్ చేయకపోతే బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుంది.
జీరో బ్యాలెన్స్ ఖాతాలు
దీర్ఘకాలంగా సున్నా బ్యాలెన్స్‌తో ఉంటూ, కేవైసీ అప్‌డేట్ చేయని ఖాతాలను కూడా బ్యాంకులు రివ్యూ చేస్తున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా వీటిని తొలగించే అవకాశం ఉంది.
ఆర్‌బీఐ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
బ్యాంకింగ్ రంగంలో భద్రతను కట్టుదిట్టం చేయడమే ఆర్‌బీఐ ప్రధాన ఉద్దేశం. వినియోగదారుల వాడకంలో లేని ఖాతాల ద్వారా మనీ లాండరింగ్ లేదా సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఖాతాదారుడు తన ఖాతాను చురుగ్గా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయాలని ఆర్‌బీఐ సూచిస్తోంది.
ఖాతాదారులు ఏం చేయాలి?
మీ బ్యాంకు ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ పనులు చేయండి. మీ ఖాతా ద్వారా ఏదైనా చిన్న లావాదేవీ (డిపాజిట్ లేదా విత్‌డ్రాయల్) చేయండి. కనీసం ఒక చిన్న డిజిటల్ పేమెంట్ (యూపీఐ) లేదా ఏటీఎం విత్‌డ్రాయల్ చేసినా మీ అకౌంట్ యాక్టివ్‌గా మారుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -