Thursday, January 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకొత్త సంవత్సర వేడుకల్లో అపశృతి..

కొత్త సంవత్సర వేడుకల్లో అపశృతి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: స్విట్జర్లాండ్‌లో జరిగిన న్యూఇయర్‌ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్ మోంటానా లోని ఒక బార్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకూ 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది.

స్విట్జర్లాండ్‌లో ప్రముఖ లే కాన్‌స్టెలేషన్‌ బార్‌లో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులంతా వేడుకల్లో నిమగమై ఉండగా బుధవారం తెల్లవారుజామున (సుమారు 1.30 గంటలకు) పేలుడు జరిగిందని నైరుతి స్విట్జర్లాండ్‌లోని వాలిస్‌ కాంటన్‌ పోలీస్‌ ప్రతినిధి గేటన్‌ లాథియోన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. భవనం మంటల్లో చిక్కుకోగా, సహాయక సిబ్బంది అత్యవసర సేవలు చేపడుతున్న దృశ్యాలు స్విస్‌ మీడియాలో కనిపించాయి. కొత్త ఏడాది రోజున ఈ ఘటన అనేక కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -