Thursday, January 1, 2026
E-PAPER
Homeమెదక్బీమా కోరేగావ్  ఆత్మగౌరవ పోరాటం

బీమా కోరేగావ్  ఆత్మగౌరవ పోరాటం

- Advertisement -

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
అధికార అహంకారులపై మహర్లు జరిపిన ఆత్మగౌరవ పోరాటమే బీమా కోరేగావ్ యుద్ధమని జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ కేడం లింగమూర్తి అభివర్ణించారు. గురువారం  హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మహారాష్ట్రలోని లో పీష్వాలపై అల్పసంఖ్యాకులైన దళిత బహుజనులు జరిపిన ఆత్మాభిమాన పోరాటానికి గుర్తుగా అమృత వీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా గ్రంధాలయ చైర్మన్ లింగమూర్తి మాట్లాడుతూ ఆనాటి భీమా కోరేగాం పోరాటం పేదలకు పెత్తందారులకు జరిగిన ఆత్మాభిమాన ప్రతీక అన్నారు. వేలాది పీష్వా సైనికులపై 500 మంది అల్ప సంఖ్యాక మహర్లు ఆత్మాభిమానంతో పోరాడి వీరమరణం పొందాలని గుర్తు చేశారు. ఈ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శౌర్య దినోత్సవం గా గుర్తిస్తూ తను జీవించి ఉన్నంతకాలం ఆ పవిత్ర ప్రదేశాన్ని క్రమం తప్పకుండా సందర్శించాడని అన్నారు. అగ్రవర్ణ ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా జరిగిన ఈ పోరు నేటి యువతరానికి ఆదర్శమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, జన జాగృతి కళా సమితి అధ్యక్షులు ముక్కెర సంపత్ కుమార్, దళిత బహుజన ప్రజాసంఘాల నాయకులు కొయ్యడ కొమురయ్య, మేకల వీరన్న యాదవ్, ఎనగందుల శంకర్, చిత్తారి రవీందర్, వెన్న రాజు, కండే సుధాకర్, ఎండి హసన్, మరియాల రాజిరెడ్డి, గడిపే సింగరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -