Thursday, January 1, 2026
E-PAPER
Homeజిల్లాలుకొంపల్లి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తాం: వెదిరె విజేందర్ రెడ్డి

కొంపల్లి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తాం: వెదిరె విజేందర్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ -మునుగోడు: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం అని వెదిరె పూలమ్మ ఫౌండేషన్ వైస్ చైర్మన్, గ్రామ ఉపసర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి అన్నారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా మండలంలోని కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడే కార్పెట్ లను వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించగా, ఆ పాఠశాలలోని ప‌దో తరగతి విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నూతనంగా ఉప సర్పంచ్‌గా ఎన్నికైన విజేందర్ రెడ్డికి ఫోటో ఫ్రేమ్ ను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా విజేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వసతుల కంటే మెరుగైన వసతులను ప్రభుత్వ పాఠశాలలో ఉండే విధంగా సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు. మండలంలోనే రాబోయే ప‌దో తరగతి ఫలితాలలో కొంపల్లి పాఠశాలకు మొదటి స్థానం దక్కే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ, ఏఏపిసి చైర్మన్ మొగుదాల శ్యామల, సంకు శంకర్,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -