- Advertisement -
నవతెలంగాణ-ఊరుకొండ: మండల పరిధిలోని ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో స్థానిక ఎస్ఐ కృష్ణదేవ సతీ సమేతంగా గురువారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి వచ్చిన దంపతులను అర్చకులు, ఆలయ చైర్మన్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ అమరచింతల శ్రీనివాసులు, పాలక మండలి సభ్యులు వారికి శాలువాతో సన్మానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Advertisement -



