- తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజి
నవతెలంగాణ-మునుగోడు: తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డికి ..మండల కేంద్రానికి చెందిన తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజి గురువారం నూతన సంవత్సరం సందర్భంగా… హైదరాబాదులోని తమ నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి మాజీమంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి హామీలు ఇచ్చుడు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాబోయే మూడేళ్లలో నైనా మునుగోడు నియోజకవర్గంగ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి , ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలలు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.



