- Advertisement -
నవతెలంగాణ-ఊరుకొండ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఊరుకొండ మండల పరిధిలోని ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తజనంతో స్వామి దర్శనం కోసం బారులు తీరారు. దీంతో భక్తుల రద్ధీ దృష్ట్యా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎస్సై కృష్ణదేవ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో సత్య చంద్రారెడ్డి, చైర్మన్ సత్యనారాయణరెడ్డి, పాలక మండలి సభ్యులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, భక్తులు, యాత్రికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



