- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటలో ఉంటున్న తమ కుమార్తె వద్దకు వచ్చారు. గురువారం సాయంత్రం స్కూటీపై వారిద్దరూ ట్యాంక్‌బండ్ చూసేందుకు బయలుదేరారు. మూసారాంబాగ్ హైటెక్ మోటార్స్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. దీంతో దంపతులు రోడ్డుపై పడిపోయారు. బస్సు వెనుక టైరు వారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
- Advertisement -



