- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి గృహోపకరణాలైన ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 5-10% పెరగనున్నాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) కొత్త స్టార్ రేటింగ్ నిబంధనల అమలుతో తయారీదారుల ఉత్పత్తి ఖర్చులు పెరగడమే దీనికి కారణం. బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బీ. త్యాగరాజన్ ప్రకారం.. 5-స్టార్ ఏసీ ధర సుమారు 10% పెరుగుతుంది. 2025లో 5-స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు 2026 నిబంధనల ప్రకారం 4-స్టార్‌గా డౌన్‌గ్రేడ్ అవుతాయి. వోల్టాస్, డైకిన్, బ్లూ స్టార్, గోద్రెజ్ వంటి కంపెనీలు ఈ మార్పులను సమర్థిస్తూ, పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొన్నాయి.
- Advertisement -



