- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గాంబియా తీరంలో 200 మందికి పైగా వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. నార్త్ బ్యాంక్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 96 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



