- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కృష్ణా జలాలపై అసెంబ్లీలో మాట్లాడి ప్రతిపక్షాల నోరు మూయించాలని కల్వకుంట్ల కవిత అన్నారు. శాసన మండలి ఆవరణలో ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేయవదన్నారు. బీఆర్‌ఎస్ మనుగడ కొనసాగాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు. ఏపీ నాయకులు శాశ్వతంగా తెలంగాణ నీళ్లు ఎత్తుకెళ్లాలని చూస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌లో బబుల్ షూటర్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని విమర్శించారు.
- Advertisement -



