Friday, January 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత సభలో మాట్లాడేందుకు, నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభలో ప్రభుత్వం పెట్టే బిల్లులపై చర్చకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేల ప్రవేశద్వారం వద్ద వారు ఆందోళనకు దిగారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ నినాదాలు చేశారు. రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావొద్దని నిర్ణయం తీసుకుంది. ఇక రేపు తెలంగాణ భవన్‌లో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఈ సమావేశానికి కేటీఆర్, హరీశ్ రావు సహా మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -