నవతెలంగాణ-హైదరాబాద్: చైనాలో దక్షణ కొరియా ప్రెసిడెంట్ లీ జే మైయుంగ్ పర్యటించనున్నారు. ఈమేరకు సౌత్ కొరియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వై సంగ్-లాక్ శుక్రవారం తెలిపారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు సోమవారం బీజింగ్ వెళ్లనున్నారని వెల్లడించారు.ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాలు పర్యాటకం, అంతర్జాతీయ పరిస్థితులు, కీలకమైన ఖనిజాలు, సరఫరా గొలుసులు, హరిత పరిశ్రమలలో సహకారం, AI, ఆధునాతన సాంకేతికలో పరస్పర సాయం తదితర అంశాలపై చర్చించనున్నారు.
కేవలం రెండు నెలల్లోనే ఇరునేతలు రెండోసారి కలువడం విశేషం. దక్షిణ కొరియా, జపాన్ నాయకుల మధ్య తదుపరి సమావేశం జరగడానికి ముందు సంబంధాలను బలోపేతం చేయడంలో బీజింగ్ ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తుంది. గత నెలలో రెండు దేశాల మధ్య రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా కోసం ఒప్పందం కుదిరింది. తాజా పర్యటనతో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి కృషి చేయనున్నారు.



