Friday, January 2, 2026
E-PAPER
Homeజాతీయంఆర్మీ క్యాంప్ దుకాణంలో అగ్నిప్ర‌మాదం

ఆర్మీ క్యాంప్ దుకాణంలో అగ్నిప్ర‌మాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉత్తరాఖండ్‌ లో ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలోని జోషిమఠ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఔలి రోడ్డులో గల ఆర్మీ క్యాంప్‌ లో మంటలు చెలరేగాయి. క్యాంప్‌ లోపల ఓ దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ వ్యాపించింది. ప్రమాద సమయంలో ఆర్మీ క్యాంప్‌లో దాదాపు 100 మంది జవాన్లు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అధికారులు స్పాట్‌లో ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -