నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాటపట్టారు. కలుషిత నీరు తాగి పదుల సంఖ్యలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనకు మంత్రి కైలాశీ విజయవర్గియ బాధ్యత వహించాలని, వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు. సమస్యపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు సంధిస్తే…బాధ్యతారాహితంగా మాట్లాడారని మండిపడ్డారు. మురుగునీటిని బాటిల్ లో పట్టుకొని ఆందోళన కారులు భోపాల్‌లోని మంత్రి నివాసం వద్ద నిరసన చేపట్టారు. రోడ్డుపై బైటాయించి మంత్రి కైలాశీ విజయవర్గీయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలు మురుగునీరు తాగుతుంటే.. బీజేపీ నేతలు ఆర్వో వాటర్ తాగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. సదురు మంత్రి నైతిక విలువలు మరిచి అనుచితంగా మాట్లాడారని ధ్వజమెత్తారు
కాగా మధ్యప్రదేశ్ ఇండోర్ లో కలుషిత నీరు తాగి పదుల సంఖ్యలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. 1100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని, అందులో చాలామంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మేయర్ చెప్పారు.



