Thursday, May 22, 2025
Homeతాజా వార్తలువిద్యుత్ షాక్ తో రైతు మృతి 

విద్యుత్ షాక్ తో రైతు మృతి 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని ఘన్పూర్ (ఆర్) కు చెందిన భూక్యరాజు (35) ఉదయం గం,10 లకు తన సొంత పొలంలో గేట్ల పైన గల మొక్కలను తొలగిస్తున్న తరుణంలో, విద్యుత్ బోరుకు సరపర అవుతున్న విద్యుత్ సర్వీసు వైరు ప్రమాదవశాత్తు గొడ్డలికి తగిలి అతని చేతి పై పడటంతో విద్యుత్ షాక్ తో గాయాలవడంతో, చుట్టుపక్కల వారు, కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారని భార్య వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లల గలరు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -