- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గత రెండు, మూడు రోజుల నుంచి కాస్త చలి తగ్గినప్పటికీ రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆదిలాబాద్, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, KMD, కొమురంభీం ఆసిఫాబాద్, మెదక్, మంచిర్యాల, MLG, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఇక ఉదయం పూట పొగమంచు కమ్ముకుని వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
- Advertisement -



