- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్‌లోని మోతిహారీ జిల్లాలో వైద్య నిర్లక్ష్యం కారణంగా 25 ఏండ్ల మహిళ ఉషాదేవి మృతి చెందింది. గతేడాది ప్రసవం కోసం ప్రయివేటు ఆస్పత్రిలో చేరిన ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు, కడుపులోనే సర్జికల్ కత్తెరను వదిలేసి కుట్లు వేశారు. 18 నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెకు ఇటీవల స్కానింగ్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అత్యవసర శస్త్రచికిత్స చేసినా, కత్తెర వల్ల పేగులు దెబ్బతిని ఇన్ఫెక్షన్ రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. బాధిత కుటుంబం వైద్యురాలిపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- Advertisement -



