Thursday, May 22, 2025
Homeజిల్లాలుమానవత్వం చాటిన బాల్య మిత్రులు

మానవత్వం చాటిన బాల్య మిత్రులు

- Advertisement -

– మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – రాయపర్తి

అకాల మరణం చెందిన స్నేహితుని కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచారు. మండలంలోని మహబూబ్ నగర్ గ్రామానికి చెందిన బీరెల్లి మహేందర్ 2000 – 2001 సంవత్సరంలో మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో చదువుకున్నాడు. కాలక్రమేనా ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందాడు. తనకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయితే తమతో పాటు చదువుకున్న స్నేహితుడు మరణం పట్ల తోటి స్నేహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే తమని వదిలి వెళ్ళటాన్ని జీర్ణించుకోలేకపోయారు. వివిధ వృత్తిలో ఉన్నవారు కలిసి 23 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మహేందర్ కుటుంబానికి అందించారు.

కష్ట కాలంలో సహాయం అందించిన చిన్ననాటి స్నేహితులను గ్రామస్తులు, బంధువులు అభినందించారు. తదుపరి మండల కేంద్రానికి చెందిన ఎనగందుల వనజ గతంలో మరణించగా వారి కుటుంబానికి 22 వేల  ఆర్థిక సహాయాన్ని అందించారు. తమతో పాటు చదువుకొని చిన్న వయసులోనే స్వర్గస్తులైన వారి పిల్లల చదువులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంట రమేష్, మల్యాల మధు, రజాక్, పెండ్లిరాజు, సంతోష్, ప్రవీణ్, రేసు శ్రీకాంత్, సారయ్య, కృష్ణ, అశోక్, ఎకుబాల్, జక్కుల రాజయ్య, శ్రీకాంత్, సిహెచ్ కృష్ణ కుమార్, అశోక్, సాబీర్, చిన్నలరాజు, పూజారి సంతోష్, మామిడాల అశోక్, బాబు, పెండ్యాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -