Thursday, May 22, 2025
Homeరాష్ట్రీయంనకిలీ, అర్హత లేని వైద్యులకు మందుల సరఫరా

నకిలీ, అర్హత లేని వైద్యులకు మందుల సరఫరా

- Advertisement -

– హౌల్‌సేలర్లు, డీలర్లపై చర్యలు : డీసీఏ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నకిలీ , అర్హత లేని వైద్యులు, లైసెన్స్‌ లేని షాపులకు మందులను సరఫరా చేసే హౌల్‌ సేలర్లు, డీలర్లపై చర్యలు తీసుకోబోతున్నట్టు డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ (డీసీఏ) హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ డైరె క్టర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాసిం ఒక ప్రకటన విడు దల చేశారు. డ్రగ్‌ లైసెన్స్‌ లేకుండా మందులను నిల్వ ఉంచినా, విక్రయించినా వారిపై డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ యాక్ట్‌, 1940 ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అదే సమయంలో అలాంటి వారికి చట్టవిరుద్ధంగా, అనధికారికంగా మందులను సరఫరా చేస్తున్న వారిపైనా చర్యలుం టాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆమోదించిన లైసెన్స్‌ పొందిన వారికి మాత్రమే మందులను సరఫరా చేయాలని ఆయన సూచించారు. మందులను సరఫరా చేసేముందు అవి తీసుకుం టున్న వ్యక్తులు, సంస్థలు డ్రగ్‌ లైసెన్స్‌ కలిగి ఉన్నారా? రికార్డు నిర్వహిస్తున్నారా? తనిఖీ చేసు కోవాలని కోరారు. వీటిని పాటించని వారిపై చట్ట పరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్స్‌ యాక్ట్‌ ప్రకారం తెలంగాణ డీసీఏ డ్రగ్‌ లైసెన్స్‌లను జారీ చేస్తుందని తెలిపారు. లైసెన్స్‌ లేకుండా మందులను విక్రయించేందుకు నిల్వ ఉంచితే చట్ట ప్రకారం గరిష్టంగా ఐదేండ్ల వరకు జైలు శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చట్టవిరుద్ధంగా మందు లను విక్రయించేం దుకు నిల్వ ఉంచిన 163 మంది నకిలీలను గుర్తించి కేసులు నమోదు చేశారు. తాజాగా విశ్వసనీయ సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, తుక్కు గూడ మున్సిపాల్టీ, రావిర్యాల గ్రామంలో శ్రీ బాలాజీ క్లినిక్‌ నిర్వహిస్తున్న నకిలీ వైద్యులు గుండ్లపల్లి నర్సింహ, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం, ఓల్డ్‌ డోర్నకల్‌ గ్రామంలోని ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న మొహ మ్మద్‌ మసూద్‌ల వద్ద నుంచి చట్టవిరుద్ధంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను పరీక్షలకు పంపించారు. తదుపరి విచారణ కొనసాగుతుందనీ, చట్టపరం గా చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -