Wednesday, January 7, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో వాయు కాలుష్యం..ఆప్‌ ఎమ్మెల్యేల నిరసన

ఢిల్లీలో వాయు కాలుష్యం..ఆప్‌ ఎమ్మెల్యేల నిరసన

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తక్షణమే వేగవంతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో మాస్కులు పెట్టుకుని ఆప్‌ ఎమ్మెల్యేలు నిరసన చేశారు. అసెంబ్లీ ప్రతిపక్షనేత అతిషి నాయకత్వాన ఈ నిరసన జరిగింది. వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే విధాన చర్యలు చేపట్టాలని, క్షీణిస్తున్న గాలి నాణ్యతలకు ప్రభుత్వమే వహించాలని ఆప్‌ డిమాండ్‌ చేసింది. ఢిల్లీలో తీవ్రమైన గాలి కాలుష్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్దులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఈ నిరసనలో ఆప్‌ నేతలు రాష్ట్ర ప్రభుత్వానిన డిమాండ్‌ చేశారు. వాహనాల నుండి వెలువడే ఉద్గారాలు, పారిశ్రామిక ఉద్గారాలు, పొరుగు రాష్ట్రాలు హర్యానా వంటి రాష్ట్రాలు పంట వ్యర్థాలను తగులబెట్టడం వంటి విషయాల్లో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆప్‌ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -