– మావోయిస్టులను కాల్చి చంపడంపై సీపీఐ(ఎం) ఖండన
– కేంద్రం శాంతిచర్చలు జరపాలి : రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్ అడవుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావుతోపాటు 27 మంది మావోయిస్టులను కేంద్ర బలగాలు కాల్చి చంపడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు మావోయిస్టులు చర్చలు జరుపుదాం, శాంతియుతంగా సమస్యను పరిష్కరిద్దాం, ఆయుధాల విషయాన్ని కూడా చర్చిద్దామంటూ కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారనీ, లేఖలు రాశారని గుర్తు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం మూర్ఖంగా నక్సలైట్లను అదేవిధంగా ఆ పేరుతో గిరిజనులను కాల్చి చంపే నరహంతక చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. చత్తీస్‌ఘడ్ అడవుల్లో కార్పొరేట్ సంస్థలకు అక్కడ ఉండే ఖనిజ సంపాదనంతా ధారాదత్తం చేయడానికి ఆటంకంగా ఉన్నది కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మావోయిస్టుల చర్చల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి శాంతియుత వాతావరణానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అమాయక ప్రజలపై సాగిస్తున్న నరమేధానికి స్వస్తి పలకాలని కోరారు.
నరమేధానికి స్వస్తిపలకాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES