Thursday, January 29, 2026
E-PAPER
Homeనిజామాబాద్రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మాక్ పార్లమెంట్

రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మాక్ పార్లమెంట్

- Advertisement -

నవతెలంగాణ-రెంజల్: రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం విద్యార్థులచే మాక్ పార్లమెంట్ నిర్వహించారు. విద్యార్థులే భారత ప్రధానమంత్రి, లోక్‌స‌భ‌ స్పీకర్, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలుగా మాక్ పార్లమెంటును మాట్లాడారు. ఈ సమావేశంలో భారత ప్రధానిగా యోగేష్, ప్రతిపక్ష నేతగా చిన్నారి, హోమ్ మనిస్టర్ గా శశాంత్, పార్లమెంటు స్పీకర్గా నౌషీన్, కేంద్ర మంత్రులుగా విద్యార్థులు తమ ప్రతిభను కనబడుచారని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు అరుణ్ తెలిపారు. విద్యార్థులచే ఇలాంటి మాక్ పార్లమెంటు నిర్వహించినట్లయితే పార్లమెంట్లో జరిగే విషయాలపై విద్యార్థులకు అవగాహన వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కామరోన్నిసా, కిషోర్ కుమార్, సుధాకర్, నాందేవ్, షర్పోద్దిన్, నరేందర్, ముత్తయ్య, శంకర్, శ్రీనివాస్ రెడ్డి, నౌషిన్ జగదీష్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -