Thursday, May 22, 2025
Homeరాష్ట్రీయంపంచాయతీలకు రూ.153 కోట్లు

పంచాయతీలకు రూ.153 కోట్లు

- Advertisement -

– ఒకేరోజు పెండింగ్‌ బిల్లులన్నీ చెల్లింపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒకేరోజు పెండింగ్‌ బిల్లులన్నీ చెల్లించింది. పంచాయతీలకు దాదాపు రూ.153 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీర్ఘకాలికంగా 9990 బిల్లులను ఒకేసారి ఇచ్చేసింది. ఈసారీ రూ. 10 లక్షల లోపు బిల్లులకు సంబంధించిన నిధులకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపింది. 2024 ఆగస్టు వరకు ఉన్న బిల్లులకు నిధులు ఇచ్చింది. ఇదిలావుండగా ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్‌) కింద చేపట్టిన ఆయా పనులకుగాను రూ.85 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -