నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మెడికల్ పీజీ చేసిన అభ్యర్ధులు ప్రభుత్వ సూపర్ స్పెసాలిటీ ఆస్పత్రిలో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధన అమలుకు గడువు విధించరాదంటూ హైకోర్టు బుధవారం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మెడిసిన్లో పీజీ పూర్తి చేసి రిజిస్ట్రేషన్ల ముందు ప్రభుత్వ ఆస్పత్రిల్లో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధనను సవాలు చేస్తూ 46 మంది డాక్టర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జె శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కోర్సు పూర్తయినప్పటికీ సర్టిఫికెట్లను విడుదల చేయడంలేదన్నారు. ప్రభుత్వ సర్వీసు తప్పనిసరిగా చేయాలంటూ అడ్మిషన్ల సమయంలోనే రూ.50 లక్షల బాండ్ తీసుకున్నారన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీసు అందించాలంటూ ప్రభత్వుం 2017లో జారీ చేసిన జీవోను కొట్టేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు. ఈలోగా సర్వీసులో చేరడానికి గడువు విధించరాదని ఆదేశాలు జారీ చేశారు.
పీజీ డాక్టర్లకు సర్వీసులో చేరడానికిగడువు వద్దు : హైకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES