- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: వేసవి సెలవులు కావటంతో భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 80,964 మంది స్వామివారిని దర్శించుకోగా 32,125 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లు సమకూరినట్లు టీటీడీ ప్రకటించింది.
- Advertisement -