Thursday, May 22, 2025
Homeజాతీయంజమ్మూకశ్మీర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదులు ఎన్‌కౌంట‌ర్

జమ్మూకశ్మీర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదులు ఎన్‌కౌంట‌ర్

- Advertisement -


న‌న‌తెలంగాణ-హైద‌రాబాద్:
ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో తీవ్ర‌వాద కార్య‌క‌లాపాల‌పై భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఉక్కుపాదం మోపూతున్నాయి. దీంతో జమ్మూకశ్మీర్‌లోని స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో ఉగ్ర‌వాదుల కోసం సెర్చ్ ఆప‌రేషన్‌ ముమ్మ‌రంగా సాగుతోంది. తాజాగా ఇవాళ‌ సింగ్‌పోరా వద్ద భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇవాళ కిష్ట్వార్ జిల్లాలో చత్రూ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ , జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్ జవాన్లు కలిసి జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చెపట్టారు. ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదులు భద్రతా దళాలకు తార‌స ప‌డ‌గా..రెండు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం కాల్పులు జ‌రిపాయి. న‌లుగురు ఉగ్ర‌వాదుల హ‌తమైయ్యారు. మిగిలిన వాళ్ల కోసం ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -