ననతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల అరబ్ దేశాల్లో ట్రంప్ పర్యటించిన విషయం తెలిసిందే. ఖతార్ దేశం 400 మిలయన్ డాలర్లు విలువ చేసే బోయింగ్ 747 విమానాన్ని యూఎస్ ప్రెసిడెంట్ కు బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ గిప్ట్ స్వీకరించడంపై ఇంటిబయట ట్రంప్ పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ తన చిందులు వేశారు.. ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ తో సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ బీసీ విలేకరి ఇటీవల ట్రంప్ కు ఖతార్ బహుమతిగా ఇచ్చిన బోయింగ్ విమానం గురించి ప్రశ్నించారు. అలాంటి బహుమతి స్వీకరించడం నైతికమేనా అని ప్రశ్నించాడు. మరికొన్ని ప్రశ్నలు అడుగుతుండగా కలుగజేసుకున్న ట్రంప్.. సదరు రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఖతార్ జెట్ తో నీకేం పని అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్.. వాళ్లు యూఎస్ వైమానిక దళానికి జెట్ ఇస్తున్నారు. ఇది గొప్ప విషయం. ఇక్కడ మేము చాలా ఇతర విషయాలు మాట్లాడుతుంటే వాటిని ఎన్ బీసీ పక్కదారి పట్టించే ప్రయత్నిస్తోంది. నువ్వు నిజమైన రిపోర్టర్ వేనా? నీకు తెలివిలేదు.. మీ మాతృసంస్థపై దర్యాప్తు చేయాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో.. గెట్ అవుట్ అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశాడు .
ఆ దేశ గిప్ట్‌పై విలేఖరి ప్రశ్న..కసుమన్న ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES