నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో పెద్దఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇండియానా రాష్ట్రంలో కొకైన్‌ను తరలిస్తున్న ఇద్దరు భారతీయ డ్రైవర్లను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈనెల 4న ఇండియానాలో చిన్న ట్రక్కుల్లో కొకైన్ తరలించడాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారని డీహెచ్‌ఎస్ తెలిపింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ట్రక్కుల్లోని స్లీపర్ బర్త్ నుంచి 309 పౌండ్ల కొకైన్ ను కనుగొన్నట్లు వివరించింది. నిందితులు భారత్‌కు చెందిన గుర్‌ప్రీత్ సింగ్ (25), జస్వీర్ సింగ్ (30)గా గుర్తించినట్లు వెల్లడించింది. దీన్ని అడ్డుకోకపోయుంటే అనేకమంది అమెరికన్ల ప్రాణాలకు ముప్పు కలిగిఉండేదని ఆందోళన వ్యక్తంచేసింది. నిందితులు కాలిఫోర్నియా నుంచి వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందారని పేర్కొంది. గుర్‌ప్రీత్ 2023లో యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించామని వెల్లడించింది. తాను భారతీయుడినని, అక్రమంగా యూఎస్‌లో ఉంటున్నానని గుర్‌ప్రీత్ అంగీకరించినట్లు తెలిపింది. ఇక, జస్వీర్ సింగ్ కూడా 2017లో అక్రమంగానే యూఎస్‌కు వచ్చినట్లు గుర్తించామని పేర్కొంది.
అమెరికాలో భారీగా కొకైన్ రవాణా.. ఇద్దరు భారతీయులు అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



