Saturday, January 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅట్లాంటిక్ జలాల్లో ర‌ష్యా జెండాతో ఉన్న ఆయిల్ ట్యాంక‌ర్ సీజ్

అట్లాంటిక్ జలాల్లో ర‌ష్యా జెండాతో ఉన్న ఆయిల్ ట్యాంక‌ర్ సీజ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అట్లాంటిక్ జలాల్లో ర‌ష్యా జెండాతో ఉన్న ఆయిల్ ట్యాంక‌ర్‌ను అమెరికా కోస్ట్ గార్డు దళాలు సీజ్ చేశాయి. ‘మరినెలా’ అనే ఈ చమురు ట్యాంకర్‌ను గత రెండు వారాలుగా యూఎస్ ట్రాక్ చేస్తోంది. వెనిజులాతో సంబంధ ఉన్న ఈ ట్యాంకర్‌ను యూఎస్ నియంత్రించేందుకు ప్రయత్నించింది. దీంతో, యూరప్ సముద్ర తీరాల్లో రెండు దేశాల మధ్య ఉద్రికత్త నెలకొంది.రష్యన్ మీడియా ప్రకారం.. అమెరికా బలగాలు హెలికాప్టర్ ద్వారా ‘మరినెలా’ అనే ట్యాంకర్‌ పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. అమెరికన్ కోస్ట్ గార్డ్ నౌక చాలా రోజులగా ట్యాంకర్‌ను వెండిస్తున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన చిత్రాలను కూడా విడుదల చేసింది.

యూఎస్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఫెడరల్ కోర్టు వారెంట్‌తో దీనిని సీజ్ చేశామని యూఎస్ యూరోపియన్ కమాండ్ ఎక్స్‌లో పోస్ట్ తెలిపింది. యూఎస్ దీనిని నిర్బంధించేందుకు చేసిన ప్రయత్నాలను తప్పించుకునేందుకు ప్రయత్నించిందని, జెండాలు, రిజిస్ట్రేషన్లు మార్చడం ద్వారా తప్పించుకోవాలని చూసినట్లు చెబుతున్నారు.

https://twitter.com/i/status/2009042811736469596
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -